![]() |
![]() |
బిగ్ బాస్ హౌజ్ లో సీరియల్ బ్యాచ్ అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్ కలిసి గ్రూప్ గా ఆడుతున్నారనే విషయం అందరికి తెలిసిందే. ఇక గ్రూప్ లో మొదటి నుండి అమర్ దీప్, టేస్టీ తేజ ఉంటూ వారి ఓటమిని వారే తెచ్చుకుంటున్నారు. వారి ఇండివిడ్యువల్ గేమ్ ని మర్చిపోయి సీరియల్ బ్యాచ్ కోసం ఆడుతున్నారు. ఇకనైన ఆట సందీప్, టేస్టీ తేజ మేలుకోకపోతే ఎలిమినేషన్ అవుతారని నెటిజన్లు చేసే ట్రోల్స్ లో తెలుస్తుంది. అయితే నిన్న ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో శివాజీ తన సత్తా చాటుకున్నాడు. ఆదివారం బిగ్ బాస్ హౌజ్ లో సాధారణంగా ఫన్ డే అంటు గేమ్స్ ఆడిస్తూ నామినేషన్లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తుంటాడు నాగార్జున. అయితే ఎపిసోడ్ మొదట్లోనే నాగార్జునని శివాజీ క్వశ్చన్ చేసాడు. 'బాబు గారు.. నేను ఎందుకు అన్ డిజర్వింగ్.. ఒక్క కారణం చెప్పమనండి. నేను సంఛాలక్ గా బయాజ్(పక్షపాతం) గా ఉన్నానని పవరస్త్రాని తీసేసుకొని కంటెస్టెంట్స్ ని చేసేశారు. నేను అసలు బయాజ్ గా లేను, ఒక్క కారణం, జరిగిన దాంట్లో ఒక్కటి చూపించండిని నాగార్జునని శివాజీ అడుగగా.. ఇక అది కంటెస్టెంట్స్ నిర్ణయం అంటూ నాగార్జున నవ్వేశాడు.
నేను అన్ డిజర్వింగ్ అనడానికి ఒక్క రీజన్ చూపించమని శివాజీ అనగా.. ఇక సంఛాలక్ గా ఉన్న శోభా శెట్టిని లేపి.. అసలెందుకు శివాజీని బయాజ్ గా ఉన్నాడని మీరంతా అన్నారని నాగార్జున అడిగాడు. ఆట సందీప్, నేను జ్యూరీగా ఉన్నప్పుడు అమర్, ప్రియాంక అంటే చాలు అసలు సపోర్ట్ చేయట్లేదని శోభా శెట్టి అంది. అలా అనేసరికి మరి నువ్వెందుకు అమర్ దీప్ కి సపోర్ట్ చేస్తున్నావని నాగార్జున సూటిగా అడిగేసరికి శోభా శెట్టి మాట తడబడింది. నేను అలా అనలేదు సర్.. మా ఇద్దరి డెసిషన్ లో అమర్ దీప్ అని పేరు వస్తే శివాజీ గారు బయాజ్ గా ఉంటున్నారని అంది. శివాజీ బయాజ్ గా ఉంటే అమర్ దీప్ నామినేషన్లో లేడు కదా అని క్వశ్చనింగ్ చేశాడు నాగార్జున. మరి ఎవరి పక్షాన నిలబడుతున్నాడని నాగార్జున అనగా.. యావర్, పల్లవి ప్రశాంత్ ల వైపు ఉంటున్నాడని శోభా అంది. వాళ్ళిద్దరి పక్షాన ఉంటే యావర్ ఎందుకు నామినేషన్లో ఉన్నాడని అన్నాడు. ఇక శోభా శెట్టి దగ్గర సమాధానం లేదు. ఆట సందీప్ కూడా అదే చెత్త రీజన్ చెప్పాడు. ప్రియాంక, గౌతమ్ కృష్ణ చెప్పిన కారణాలలో కూడా సరైన కారణం ఒక్కటి లేకపోవడంతో నాగార్జున రియలైజ్ అయ్యాడు.
సీరియల్ బ్యాచ్ తో పాటు గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ గుడ్డిగా శివాజీ అన్ డిజర్వింగ్ అని ఓట్లు వేసారని తెలిసింది. అయితే ఇప్పటికే చాలా సార్లు సంఛాలక్ గా ఆట సందీప్ ఫెయిల్ అయ్యాడని నాగార్జున చెప్పాడు. అయిన శివాజీని హౌజ్ మేట్ గా తీయడమేంటి, ఆట సందీప్ ని కదా తీసేయాలి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. దీన్ని బట్టి నాగార్జునతో పాటుగా బిగ్ బాస్ ప్రేక్షకులకు కూడా స్పష్టంగా తెలిసిందేంటంటే సీరియల్ బ్యాచ్ అంతా కలిసి శివాజీని టార్గెట్ చేశారని తెలుస్తుంది.
![]() |
![]() |